Jan 09 2026జనవరి 09 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 09 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము కృష్ణ పక్షం

తిథి: షష్ఠి ఉ.10.30 కు తదుపరి సప్తమి 10 ప.11.12 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఉత్తర సా.5.15 కు తదుపరి హస్త 10 సా.6.36 కు
యోగం: శోభన సా.4:55 కు తదుపరి అతిగండ 10 సా.4:58 కు
కరణం: వణిజ ఉ.7.05 కు తదుపరి విష్టి రా.7:39 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 9.04 - 9.48 కు, మ. 12.45 - 1.29 కు
వర్జ్యం: రా.2.08 - 3.49 కు
అమృతకాలం: ఉ. 06.05 - 07.46 కు
సూర్యోదయం: ఉ. 6.52 కు
సూర్యాస్తమయం: సా. 5.53 కు

గురుబోధ:
పండుగలు ఇంటిలో జరపకపోవడం వల్ల దేవతల అనుగ్రహం పొందలేము. పండుగలు, పర్వదినములు వచ్చినప్పుడు తప్పక ఇంటిలో యథాశక్తి పూజ చేయాలి. ప్రత్యేక నైవేద్యాలు నివేదించాలి. పండుగ వైశిష్ట్యాన్ని తెలుసుకోవాలి, పిల్లలకి చెప్పాలి. సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఆ రోజు చేసే పూజ, జప తప లేదా ఇతర పుణ్యకార్యములు వేలరెట్ల ఫలితం ఇస్తుంది. ఉదా౹౹ దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజించడం, అర్చించడం వంటివి చేయడం వల్ల అమ్మవారు సులభంగా అనుగ్రహిస్తుంది.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less