Jan 09 2025జనవరి 09 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 09 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం

తిథి: దశమి మ.12.00 కు తదుపరి ఏకాదశి 10 ఉ.10.07 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: భరణి మ.3.08 కు తదుపరి కృత్తిక 10 మ.2.03 కు
యోగం: సాధ్య సా.05.29 కు తదుపరి శుభ 10 మ.2.36 కు
కరణం: గరజి మ. 12.22 కు తదుపరి వణిజ రా.11:21 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10.33-11.17 కు & మ.2.57-3.41 కు
వర్జ్యం: రా.2.35- తె.4.05 కు
అమృతకాలం: ఉ.9.37 - 11.00 కు
సూర్యోదయం: ఉ. 6:52 కు
సూర్యాస్తమయం: సా. 5:53 కు

గురుబోధ:
శ్రీ త్యాగరాజ స్వామి వారి నిత్య పారాయణ గ్రంథం పోతనగారి శ్రీమద్భాగవతం. త్యాగరాజస్వామికి గొప్ప బహుమానం ఇవ్వాలని తన ప్రియశిష్యులలో ఒకరు శ్రీ పోతన భాగవతాన్ని మొత్తం స్వయంగా వ్రాసి బహూకరించాడు. త్యాగరాజాస్వామికి పోతన భాగవతం అంటే అంత ఇష్టం. అటువంటి గొప్ప గ్రంథాలని నిత్యం మనం కూడా పారాయణం చేయడం వల్ల భగవంతునికి మరింత దగ్గర అవుతాము. ఇక భాగవతసప్తాహాలలో పాల్గొన్నా, గురువుల ఆధ్వర్యవంలో భాగవతసప్తాహాలు చేయించుకున్నా అది అనేక యజ్ఞముల కంటే గొప్పది. పితృదేవతల ఆశీర్వాదం ఉంటే ఇంటిల్లిపాదికీ ఆయురారోగ్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. పితృదేవతల ఋణం తీర్చుకుని వారిని తరింపచేయాలన్నా, కీర్తి కావాలన్నా, ధర్మం వృద్ధి పొందాలన్నా, అన్నింటా విజయం లభించాలన్నా, ఆయురారోగ్యాలు పెరగాలన్నా, పాపాలు తొలగిపోవాలన్నా, మోక్షం లభించాలన్నా తప్పక భాగవతం శ్రవణం చెయ్యాలని సాక్షాత్ శ్రీకృష్ణుడే బ్రహ్మకు చెప్పాడు. విష్ణుసంబంధమైన భాగవతాన్ని వినేవారికి దేవతలు కూడా నమస్కరిస్తారు. సకలదేవతలు, పవిత్రనదీనదాలు, పర్వతాలు, అన్నీ కూడా భాగవతశ్రవణం జరిగే చోట అదృశ్యంగా ఉంటాయి.

expand_less