Jan 09 2024జనవరి 09 2024favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 జనవరి 09 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షము

తిథి : త్రయోదశి  రా. 08గం౹౹38ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : జ్యేష్ఠ రా. 07గం౹౹57ని౹౹ వరకు తదుపరి మూల
యోగం : వృద్ధి రా. 12గం౹౹22ని౹౹ వరకు తదుపరి ధ్రువ 
కరణం :  గరజి ఉ. 11గం౹౹17ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹02ని౹౹ నుండి 09గం౹౹47ని౹౹ వరకు & రా. 11గం౹౹06ని౹౹ నుండి 11గం౹౹58ని౹౹ వరకు
వర్జ్యం : తె. 03గం౹౹49ని౹౹ నుండి 05గం౹౹24ని౹౹ వరకు  
అమృతకాలం : ఉ. 11గం౹౹11ని౹౹ నుండి 12గం౹౹47ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹38ని౹౹కు

👉🕉️ మహాప్రదోషం 🕉️👈

గురుబోధ
ప్రదోషసమయం (సాయం సంధ్య) లో శివారాధన, శివ పూజ, శివాభిషేకము, జపము చాలా విశేషమైనది. మహాభారతం ఆనుశాసనిక పర్వంలో ఉండే వేదాలు, ఉపనిషత్ సారమైన అత్యద్భుత స్తోత్రం శివసహస్రనామ స్తోత్రం. ఇది మానసిక, శారీరిక ఆరోగ్యాన్ని ప్రసాదించడమే కాక స్వర్గాన్ని సైతం ప్రసాదిస్తుంది. ఒక సంవత్సరం పాటు విడిచిపెట్టకుండా చదివినా, శ్రవణం చేసినా, వాళ్ళు అశ్వమేథయాగం చేసిన ఫలితాన్ని పొందుతారు.

శ్రీ శివసహస్రనామ స్తోత్రం👇


ఉదంకుడి చరిత్ర👇


expand_less