Jan 09 2023జనవరి 09 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జనవరి 09 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
పుష్యమాసం కృష్ణపక్షము

తిథి : విదియ ఈ రోజు ఉదయం 07గం౹౹25ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : ఇందువారం  (సోమవారం)  
నక్షత్రం : ఆశ్లేష పూర్తిగా ఉంది 
యోగం :  విష్కoభ ఉదయం 10గం౹౹32ని౹౹ వరకు తదుపరి ప్రీతి
కరణం :  గరజి ఈ రోజు ఉదయం 09గం౹౹39ని౹౹ వరకు  తదుపరి  వణిజ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12గం౹౹30ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹43ని౹౹ నుండి 03గం౹౹27ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 06గం౹౹52ని౹౹ నుండి 08గం౹౹38ని౹౹ వరకు 
అమృతకాలం : తెల్లవారి 04గం౹౹00ని౹౹ నుండి 05గం౹౹30ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹38ని౹౹

గురుబోధ
రాత్రి పడుకునే ముందు మఱియు ఉదయం నిద్రలేవగానే భగవన్నామ స్మరణ చేస్తే మనం నిద్రించిన సమయము అంతా భగవన్నామము చేసినపుణ్యం కలుగుతుంది.  అందుకే తప్పక ఏదో ఒక భాగవన్నామము తలచుకోవాలి. రామేశ్వరం, రామేశ్వరం, రామేశ్వరం అని అలాగే క్షిప్ర, క్షిప్ర, క్షిప్ర అనుకుని పడుకుంటే సర్వశుభాలు ప్రాప్తించి రామలింగేశ్వరుని, మహాకాళుని అనుగ్రహం కలుగుతుంది.

expand_less