కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 08 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం
తిథి: నవమి మ.2.18 కు తదుపరి దశమి 9 మ.12.00 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: అశ్విని సా.4.44 కు తదుపరి భరణి 9 మ.3.08 కు
యోగం: సిద్ధ రా.8.23 కు తదుపరి సాధ్య 9 సా.05.29 కు
కరణం: కౌలవ మ.2.26 కు తదుపరి తైతుల రా. 1.24 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: మ.12.00 - 12.44 కు
వర్జ్యం: మ.1.01 - 2.31 కు & రా.1.41 - 3.11 కు
అమృతకాలం: ఉ. 11.00 - 12.22 కు
సూర్యోదయం: ఉ. 6:52 కు
సూర్యాస్తమయం: సా. 5:53 కు
గురుబోధ:
రాత్రి పడుకునే ముందు మఱియు ఉదయం నిద్రలేవగానే భగవన్నామ స్మరణ చేస్తే మనం నిద్రించిన సమయము అంతా భగవన్నామము చేసిన పుణ్యం కలుగుతుంది. అందుకే తప్పక ఏదో ఒక భాగవన్నామము తలచుకోవాలి. రామేశ్వరం, రామేశ్వరం, రామేశ్వరం అని అలాగే క్షిప్ర, క్షిప్ర, క్షిప్ర అనుకుని పడుకుంటే సర్వశుభాలు ప్రాప్తించి రామలింగేశ్వరుని, మహాకాళుని అనుగ్రహం కలుగుతుంది.