Jan 08 2023జనవరి 08 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జనవరి 08 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
పుష్యమాసం కృష్ణపక్షము

తిథి : విదియ ఈ రోజు పూర్తిగా ఉంది
వారం : భానువారం  (అదివారం)  
నక్షత్రం : పుష్యమి తెల్లవారి 04గం౹౹41ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష
యోగం :  వైధృతి ఉదయం 09గం౹౹43ని౹౹ వరకు తదుపరి విష్కoభ
కరణం :  కౌలవ ఈ రోజు ఉదయం 07గం౹౹07ని౹౹ వరకు  తదుపరి  తైతుల
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం 04గం౹౹10ని౹౹ నుండి 04గం౹౹54ని౹౹ వరకు 
వర్జ్యం : ఉదయం 10గం౹౹58ని౹౹ నుండి 12గం౹౹41ని౹౹ వరకు 
అమృతకాలం : రాత్రి 09గం౹౹34ని౹౹ నుండి 11గం౹౹20ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹38ని౹౹ 

గురుబోధ
దేవతాకల్యాణములు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దర్శించేవారు మరియు సహకరించేవారందరికీ సకల శుభములు కలుగుతాయి. పెళ్లి కానివారికి శీఘ్రంగా మంచివారితో వివాహం అవుతుంది. దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది. పిల్లల భవిష్యత్ బాగుంటుంది.

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే శ్రీ స్కాందపురాణం 3వ భాగం ప్రవచనం 8 రోజులు - భాగ్యనగరం శ్రీ కృష్ణ మందిరంలో 2023 జనవరి 01వ తేదీ ఆదివారం నుండి 2023 జనవరి 8వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.

expand_less