Jan 06 2023జనవరి 06 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జనవరి 06 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
పుష్యమాసం శుక్లపక్షము

తిథి : పూర్ణిమ రాత్రి 03గం౹౹08ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : భృగువారం  (శుక్రవారం)  
నక్షత్రం : ఆరుద్ర రాత్రి 11గం౹౹29ని౹౹ వరకు తదుపరి పునర్వసు
యోగం :  బ్రహ్మ ఉదయం 08గం౹౹11ని౹౹ వరకు తదుపరి ఐంద్ర
కరణం :  విష్టి ఈ రోజు  మధ్యాహ్నం 03గం౹౹24ని౹౹ వరకు  తదుపరి  బవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹48ని౹౹ నుండి 09గం౹౹32ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹29ని౹౹ నుండి 01గం౹౹13ని౹౹ వరకు
వర్జ్యం : తెల్లవారి 05గం౹౹01ని౹౹ నుండి 07గం౹౹10ని౹౹ వరకు 
అమృతకాలం : మధ్యాహ్నం 12గం౹౹33ని౹౹ నుండి 02గం౹౹17ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹37ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹37ని౹౹ 

👉🏻🕉️ఆరుద్రోత్సవం🕉️

గురుబోధ
ఆరుద్రోత్సవం - ధనుర్మాసం లో ఆర్ద్రా నక్షత్రం రోజున శివలింగాన్ని వయోభేదం, లింగభేదం లేకుండా పూజించినవారు, శివునికి కుమారస్వామి కంటే ఎక్కువ ఇష్టులవుతారు. ఈ రోజు సూర్యోదయానికి ముందు శివాభిషేకం, శివదర్శనం, శివపూజ అత్యంత పుణ్యప్రదం. ఆర్ద్రా నక్షత్రంలో శివుడు స్తంభాకారం ధరించి, మాఘమాస కృష్ణ చతుర్దశి (శివరాత్రి) నాటికి అగ్నిస్తంభ రూపానికి వచ్చాడు. అందుకే ఈ మాసం లో వచ్చే ఆర్ద్రా నక్షత్రం మఱియు మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి (శివరాత్రి), ఈ రెండు రోజులూ శివునికి అత్యంత ప్రీతికరం.

ద్రవిడ సంప్రదాయం ప్రకారం ధనుర్మాసం లో వచ్చే ఆరుద్రా నక్షత్రము నాడు ఆరుద్రోత్సవం (ఆరుద్ర దర్శనం- జనవరి 6) జరుపుతారు.

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే శ్రీ స్కాందపురాణం 3వ భాగం ప్రవచనం 8 రోజులు - భాగ్యనగరం శ్రీ కృష్ణ మందిరంలో 2023 జనవరి 01వ తేదీ ఆదివారం నుండి 2023 జనవరి 8వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.

expand_less