" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 05 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షము తిథి : చతుర్దశి రాత్రి 01గం౹౹18ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : మృగశిర రాత్రి 09గం౹౹15ని౹౹ వరకు తదుపరి ఆరుద్ర యోగం : శుక్ల ఉదయం 07గం౹౹34ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ కరణం : గరజి ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹05ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 10గం౹౹15ని౹౹ నుండి 10గం౹౹59ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹40ని౹౹ నుండి 03గం౹౹24ని౹౹ వరకు వర్జ్యం : తెల్లవారి 05గం౹౹01ని౹౹ నుండి 06గం౹౹26ని౹౹ వరకు అమృతకాలం : ఉదయం 11గం౹౹44ని౹౹ నుండి 01గం౹౹27ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹35ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹36ని౹౹ గురుబోధ మన పేరు మీద, మన పిల్లల పేరు మీద జీవితంలో ఒక్కసారైనా భాగవతసప్తాహం చేయించుకోవడం మంచిది. ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. అట్టివారికి వారి కుటుంబసభ్యులు లేక ఆప్తులు వారి పేరున భాగవతసప్తాహం జరిపించడమే ఉత్తమ మార్గం. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే శ్రీ స్కాందపురాణం 3వ భాగం ప్రవచనం 8 రోజులు - భాగ్యనగరం శ్రీ కృష్ణ మందిరంలో 2023 జనవరి 01వ తేదీ ఆదివారం నుండి 2023 జనవరి 8వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.