కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 04 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము కృష్ణ పక్షం
తిథి: పుష్య బ. పాడ్యమి ప.2.29 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పునర్వసు సా.5.40 కు
యోగం: వైధృతి రా. 01:47 కు
కరణం: కౌలవ మ. 12:30 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 04.22 - 05.06 కు
వర్జ్యం: ఉ.6.16 - 7.47 కు, రా.1.22 - 2.54 కు
అమృతకాలం: మ. 12.59 - 02.26 కు
సూర్యోదయం: ఉ. 6.51 కు
సూర్యాస్తమయం: సా. 5.50 కు
గురుబోధ:
సద్గురువులు, జగద్గురువుల నోటి వెంబడి వచ్చే ఏ వాక్కైనా శాస్త్రసమ్మతమే. ఇక దాంట్లో ఎటువంటి సందేహానికి తావు ఉండదు. ఇందుకు తార్కాణంగా, శ్రీరాముడు అనే గోపబాలుడు తమ గురువైన గర్గాచార్యుని ఆదేశం మీద ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మకు కుళ్ళిపోయిన పువ్వులను సమర్పించాడు. అతడికి శ్రీకృష్ణ పరమాత్ముడు శాశ్వత గోలోకాన్ని అనుగ్రహించాడు, అటువంటి ఉత్తమగతులు కేవలం గురువాజ్ఞను ఎటువంటి ధిక్కారము లేకుండా పాటించడం వల్ల మాత్రమే దక్కాయి.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial