కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 04 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం
తిథి: పంచమి రా.11.13 కు తదుపరి షష్ఠి 5 రా.9.07 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: శతభిషం రా.10.59 కు తదుపరి పూర్వాభాద్ర 5 రా.9.36 కు
యోగం: సిద్ధి ఉ.10.07 కు తదుపరి వ్యతీపాత 5 ఉ.7.31 కు
కరణం: బవ ఉ.10.51 కు తదుపరి కౌలవ 5 ఉ.8.09 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.8.19-9.03 కు
వర్జ్యం: ఉ.6.58-8.29 కు
అమృతకాలం: ఉ.6.51-8.13 కు
సూర్యోదయం: ఉ. 6:51 కు
సూర్యాస్తమయం: సా. 5:50 కు
గురుబోధ:
మన పేరు మీద, మన పిల్లల పేరు మీద జీవితంలో ఒక్కసారైనా భాగవతసప్తాహం చేయించుకోవడం మంచిది. ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. అట్టివారికి వారి కుటుంబసభ్యులు లేక ఆప్తులు వారి పేరున భాగవతసప్తాహం జరిపించడమే ఉత్తమ మార్గం.
పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే 54 రోజుల శ్రీ పద్మపురాణం 3వ భాగం ప్రవచనం 8 భాగాలుగా - భాగ్యనగరం, నాగోల్ అల్కాపురి దగ్గర శ్రీ కృష్ణ మందిరంలో జనవరి 06వ తేదీ సోమవారం నుండి జనవరి 12వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.