Jan 03 2026జనవరి 03 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 03 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం

తిథి: పూర్ణిమ సా.4.23 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ఆర్ద్ర సా.6.53
యోగం: బ్రహ్మ ఉ. 09:05 కు, ఐంద్ర 4 తె. 05:15 కు
కరణం: బవ మ. 03:32 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.18-09.02 కు
వర్జ్యం: తె.4.12 - 5.42 కు
అమృతకాలం: ఉ. 08.32 - 09.57 కు
సూర్యోదయం: ఉ. 6.51 కు
సూర్యాస్తమయం: సా. 5.50 కు

🕉️ పుష్య పూర్ణిమ ఆరుద్రాదర్శనం (ద్రవిడ సంప్రదయం- ధనుర్మాసం లో వచ్చే ఆరుద్రా నక్షత్రం ) శివ దర్శనం, అభిషేకం🕉️

గురుబోధ:
పరమపవిత్రమైనది ధనుర్ మాసం . సౌరమానం ప్రకారం సూర్యభగవానుడు ధనూరాశిలోకి ప్రవశించే పుణ్యకాలం. ఈ మాసం లో శ్రీమన్నారాయణుని దివ్యపత్ని శ్రీనీళాదేవి, శ్రీగోదాదేవిగా భూలోకంలో జన్మించి నిరంతరం కావేరీనదిలో స్నానం చేస్తూ శ్రీరంగనాథుని భక్తితో సేవించింది. నెలరోజులపాటు భక్తిశ్రద్ధలతో స్వామిని సేవిస్తుండగా అపూర్వ వేదమంత్రాలే పాశురముల రూపంలో తన నోటి నుండి వెలువడి మానవాళికి అందించబడ్డాయి.
మార్గశీర్షంలో ఆర్ద్రా నక్షత్రం రోజున లింగాన్ని వయోభేదం, లింగభేదం లేకుండా పూజించినవారు శివునికి కుమారస్వామి కంటే ఎక్కువ ఇష్టులవుతారు. సూర్యోదయానికి ముందు శివాభిషేకం, శివదర్శనం, శివపూజ అత్యంత పుణ్యప్రదం. ఆర్ద్రా నక్షత్రంలో శివుడు స్తంభాకారం ధరించి, మాఘమాస కృష్ణ చతుర్దశి (శివరాత్రి) నాటికి అగ్నిస్తంభ రూపానికి వచ్చాడు. అందుకే ఈ మాసం లో వచ్చే ఆర్ద్రా నక్షత్రం మఱియు మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి (శివరాత్రి) శివునికి అత్యంత ప్రీతికరం. - శ్రీ శివమహాపురాణం

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less