" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 03 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షము తిథి : ద్వాదశి రాత్రి 10గం౹౹48ని౹౹ వరకు తదుపరి త్రయోదశి వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : కృత్తిక సాయంత్రం 05గం౹౹55ని౹౹ వరకు తదుపరి రోహిణి యోగం : సాధ్య ఉదయం 06గం౹౹53ని౹౹ వరకు తదుపరి శుభ కరణం : బవ ఈ రోజు ఉదయం 09గం౹౹09ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹38ని౹౹ నుండి 09గం౹౹30ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹43ని౹౹ నుండి 11గం౹౹35ని౹౹ వరకు వర్జ్యం : ఉదయం 05గం౹౹37ని౹౹ నుండి 07గం౹౹07ని౹౹ వరకు అమృతకాలం : మధ్యాహ్నం 03గం౹౹25ని౹౹ నుండి 05గం౹౹04ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹35ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹34ని౹౹ ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు ఉదయం చేయాలి. గురుబోధ కలియుగంలో భగవంతుని అనుగ్రహం శీఘ్రంగా పొందడానికి పురాణ శ్రవణమునకు మించిన గొప్ప మార్గం లేదని వ్యాసుడు చెప్పాడు. ఎన్ని పనులు ఉన్నా కొద్దిసేపు అయినా పురాణం వినడము లేదా పారాయణం చేయడం తప్పక చేయాలి. దర్భను ధరించి పురాణము వినడం , జపం చేయడం మరింత పుణ్యప్రదమని శాస్త్రం. దర్భ ఇంటిలో ఉండడం వల్ల ఇల్లు కూడా పవిత్రమవుతుంది. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే శ్రీ స్కాందపురాణం 3వ భాగం ప్రవచనం 8 రోజులు - భాగ్యనగరం శ్రీ కృష్ణ మందిరంలో 2023 జనవరి 01వ తేదీ ఆదివారం నుండి 2023 జనవరి 8వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.