Jan 02 2026జనవరి 02 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 02 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం

తిథి: చతుర్దశి సా.6.31 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: మృగశిర రా.8.18
యోగం: బ్రహ్మ ఉ.9:05 కు
కరణం: వణిజ సా.6:53 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 9.02 - 9.46 కు, మ. 12.42 - 1.25 కు
వర్జ్యం: తె.3.06 - 4.36 కు
అమృతకాలం: మ. 12.15 - 01.40 కు
సూర్యోదయం: ఉ. 6.50 కు
సూర్యాస్తమయం: సా. 5.49 కు

గురుబోధ:
స్నానం చేయకుండా వంట వండకూడదు. ఒకవేళ అలా వండినా ఆ పదార్థాలను తినరాదని శాస్త్రం. ఎంగిలి చేత్తో పొయ్యి వెలిగించడం, తాకడం, వంట చేయడం వంటివి కూడా చేయరాదు. అగ్నిదేవుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడు. ఆయన అనుగ్రహం కలగాలంటే శుచిగా వంట వండాలి. అలా చేస్తే ఇంటిలోని వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అందుకే మడి ఆచారం విలువలు తెలిసినవారు ఎక్కువ బయట లేదా హోటళ్లలో తినడానికి ఇష్టపడరు. అనారోగ్యం తో ఉన్నవారికి లేదా అత్యవసరంగా పొయ్యి తాకాల్సి వచ్చినప్పుడు పసుపునీళ్ళు చల్లి పొయ్యి వెలిగించవచ్చు.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less