కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 02 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం
తిథి: తదియ 3 తె.2.26 కు తదుపరి చవితి రా.12.57 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: శ్రవణం రా.12.53 కు తదుపరి ధనిష్ఠ 3 రా.12.06 కు
యోగం: హర్షణ మ.2.57 కు తదుపరి వజ్ర 3 ఉ.12.37 కు
కరణం: తైతుల మ.1.48 కు తదుపరి వణిజ 3 మ.12.25 కు
రాహుకాలం: మ. 1.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10.30-11.14 కు & మ.2.53-3.37 కు
వర్జ్యం: తె.5.27-7.00 కు
అమృతకాలం: ఉ.9.35-10.57 కు
సూర్యోదయం: ఉ. 6:50 కు
సూర్యాస్తమయం: సా. 5:49 కు
గురుబోధ:
కలియుగంలో భగవంతుని అనుగ్రహం శీఘ్రంగా పొందడానికి పురాణ శ్రవణమునకు మించిన గొప్ప మార్గం లేదని వ్యాసుడు చెప్పాడు. ఎన్ని పనులు ఉన్నా కొద్దిసేపు అయినా పురాణం వినడము లేదా పారాయణం చేయడం తప్పక చేయాలి. దర్భను ధరించి పురాణము వినడం, జపం చేయడం మరింత పుణ్యప్రదమని శాస్త్రం. దర్భ ఇంటిలో ఉండడం వల్ల ఇల్లు కూడా పవిత్రమవుతుంది.