Jan 02 2024జనవరి 02 2024favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 జనవరి 02 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షము

తిథి : షష్ఠి  మ. 02గం౹౹30ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : పుబ్బ ఉ. 09గం౹౹55ని౹౹ వరకు తదుపరి ఉత్తర
యోగం : సౌభాగ్య 3వ తేదీ తె. 05గం౹౹53ని౹౹ వరకు తదుపరి శోభన
కరణం :  వణిజ సా. 05గం౹౹10ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు 
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹38ని౹౹ నుండి 09గం౹౹30ని౹౹ వరకు & రా. 10గం౹౹43ని౹౹ నుండి 11గం౹౹35ని౹౹ వరకు
వర్జ్యం : సా. 05గం౹౹53ని౹౹ నుండి 07గం౹౹39ని౹౹ వరకు  
అమృతకాలం : 3వ తేదీ తె.  04గం౹౹31ని౹౹ నుండి 06గం౹౹17ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹33ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹31ని౹౹కు

గురుబోధ
మనము చేసే పూజ, ఆరాధన, జపం భగవంతుడి ప్రీతి పొందడానికే. మన  ఆరాధ్యదైవాన్ని "బాల లేదా బాలా" స్వరూపం (చిన్న పిల్లల)  లో ఆరాధిస్తే మనం ఆరాధించే దైవం మనకు మరింత దగ్గర అవుతారని శాస్త్రం. ఉదా౹౹ బాలకృష్ణుడు, బాలదత్తుడు, బాలకుమారుడు లేదా అమ్మవారిని బాలా గా ఆరాధించడం.

expand_less