Jan 01 2026జనవరి 01 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 01 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం

తిథి: త్రయోదశి రా.8.47 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: రోహిణి రా.9.53 కు
యోగం: శుభ సా. 05:12 కు తదుపరి శుక్ల 2 మ. 01:06 కు
కరణం: కౌలవ మ. 12:06 కు తదుపరి తైతుల రా. 10:22 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.29 - 11.13 కు తదుపరి మ. 02.53 - 03.37 కు
వర్జ్యం: ప.2.26 - 3.55 కు
అమృతకాలం: సా. 07.58 - 09.23 కు
సూర్యోదయం: ఉ. 6.50 కు
సూర్యాస్తమయం: సా. 5.48 కు

🕉️ పూజ్యగురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి జన్మదివసము, షష్ట్యబ్ది (భాగ్యనగరం లో 3 దినముల పాటు విశేషకార్యక్రమాలు), ప్రదోషము 🕉️

గురుబోధ:
🕉️గురువు లేని వారు సులభంగా తరించలేరు. గురువు పాదాల దగ్గర సర్వస్యశరణాగతి చేయాలి. గురువు ద్వారా మంత్రోపదేశం పొందడం వలన ఈ జన్మలోనే ముక్తి వచ్చి తీరుతుంది. ఇలా తీసుకొన్న వ్యక్తి పునర్జన్మ ఎత్తినట్లే. 🕉️గురువులకు చేసే పాదపూజలో తులసీపత్రములను వాడరాదు. గురువుల వద్ద తల ఎత్తి సూటిగా కళ్ళలో చూసి మాట్లాడరాదు. భక్తిశ్రద్ధలతో వినయంగా తలవంచుకొని మాట్లాడాలి.
🕉️ఎవరైతే గురువుల వద్ద మంత్రం స్వీకరించారో వారందరూ కూడా గురువుల యొక్క దివ్యజన్మదివసాన్ని పురస్కరించుకుని గురుపూజ, గురునామస్మరణంతో పాటు మనకిచ్చిన మంత్రం చేసుకోవడం ఉత్తమోత్తమం. గురువుల యొక్క జన్మదివసాన్ని జరుపుకోవడం మన కర్తవ్యం.

పూజ్య గురుదేవుల అష్టోత్తరశతనామావళి👇
https://srivaddipartipadmakar.org/stotram/sri-guru-ashtottara-satanamavali/pcatid/108/

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less