కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 01 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం
తిథి: విదియ 2 తె.3.31 కు తదుపరి తదియ 3 తె.2.26 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ రా.1.34 కు తదుపరి శ్రవణం 2 రా.12.53 కు
యోగం: సాధ్య సా.4.24 కు తదుపరి శుభ 2 సా.12:39 కు
కరణం: బాలవ మ.2.56 కు తదుపరి తైతుల 2 మ.1.48 కు
రాహుకాలం: మ. 12.00-01.30 కు
దుర్ముహూర్తం: మ.11.57-12.41 కు
వర్జ్యం: ఉ.9.19-10.50 కు
అమృతకాలం: ఉ. 10:57-12:19 కు
సూర్యోదయం: ఉ. 6:50 కు
సూర్యాస్తమయం: సా. 5:49 కు
🕉️పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దివ్యజన్మదివసం, పుష్య శుద్ధ ద్వితీయ - రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారి జన్మతిథి🕉️
గురుబోధ:
🕉️గురువు లేని వారు సులభంగా తరించలేరు. గురువు పాదాల దగ్గర సర్వస్యశరణాగతి చేయాలి. గురువు ద్వారా మంత్రోపదేశం పొందడం వలన ఈ జన్మలోనే ముక్తి వచ్చి తీరుతుంది. ఇలా తీసుకొన్న వ్యక్తి పునర్జన్మ ఎత్తినట్లే. గురువులకు చేసే పాదపూజలో తులసీపత్రములను వాడరాదు. గురువుల వద్ద తల ఎత్తి సూటిగా కళ్ళలో చూసి మాట్లాడరాదు. భక్తిశ్రద్ధలతో వినయంగా తలవంచుకొని మాట్లాడాలి.
🕉️ఎవరైతే గురువుల వద్ద మంత్రం స్వీకరించారో వారందరూ కూడా గురువుల యొక్క దివ్యజన్మదివసాన్ని పురస్కరించుకుని గురుపూజ, గురునామస్మరణంతో పాటు మనకిచ్చిన మంత్రం చేసుకోవడం ఉత్తమోత్తమం. గురువుల యొక్క జన్మదివసాన్ని జరుపుకోవడం మన కర్తవ్యం.
🕉️దత్తాత్రేయుడు చాలా భక్త సులభుడు. ఆయనని నమ్మి భక్తితో నమస్కరించినా కూడా ప్రసన్నుడు అవుతాడు. నిజమైన భక్తులను ఆయన పరీక్షిస్తాడు. ఆ దత్తాత్రేయుడిని నమ్మి ఆ పరీక్ష తట్టుకుని నిలబడగలిగితే ఆయన ప్రసన్నుడు అయి ఎప్పటికీ రక్షిస్తుంటాడు.
🕉️దత్తాత్రేయుని 24 అవతారాలలో ముఖ్యమైనవి శ్రీ పాదవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి అవతారములు.
https://srivaddipartipadmakar.org/stotram/sri-guru-ashtottara-satanamavali/pcatid/108/
https://youtu.be/TN1O0jpvUSQ