February 27 2022ఫిబ్రవరి 27 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఫిబ్రవరి 27 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   మాఘ మాసం కృష్ణ పక్షము
తిథి: ఏకాదశి ఉదయం 06గం౹౹48ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం: పూర్వాషాఢ ఉదయం 07గం౹౹42ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం:  వ్యతీపాత  ఈ రోజు సాయంత్రం 05గం౹౹39ని౹౹ వరకు తదుపరి వరీయాన్
కరణం  : బాలవ   ఈ రోజు ఉదయం 08గం౹౹12ని౹౹ వరకు తదుపరి  కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 04గం౹౹31ని౹౹ నుండి 05గం౹౹18ని౹౹ వరకు 
వర్జ్యం: మధ్యాహ్నం 03గం౹౹09ని౹౹ నుండి 49గం౹౹38ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి 12గం౹౹06ని౹౹ నుండి 01గం౹౹35ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹24ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹02ని౹౹ వరకు 

ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ఆదివారం ఉదయం 7 గం౹౹ తరువాత ద్వాదశి పారణము(భోజన ప్రసాదం) చేయచ్చు.

గురుబోధ: 

ఎన్నో వేల జన్మల పుణ్య ఫలం, సంస్కారం ఉంటే గాని ఆలయాలను  శుభ్రపరచడం, ఆలయానికి కావాల్సిన కనీస అవసరాలు తీరుద్దామని ఆలోచన రాదు.  ఆలోచన వచ్చి మనం చేయాలని  అనుకున్నా స్వామి అనుగ్రహం, అనుమతి, మన మీద ప్రేమ ఉంటే గాని ఆలయంలో ఉన్న దేవతామూర్తులు మనచేత సేవ చేయించుకోరు.  భగవంతుని అనుగ్రహం పొందడానికి ఇంతకన్నా సులభమార్గం లేదు.   కాబట్టి ఎదో ఒక ఆలయముకు మనం తరచూ సేవ చేసుకుందాం!
expand_less