Feb 29 2024ఫిబ్రవరి 29 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 29 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసము కృష్ణపక్షం

తిథి: పంచమి రా. 2.25 కు తదుపరి షష్ఠి
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: చిత్త ఉ.  7.34 కు తదుపరి స్వాతి
యోగం: వృద్ధి సా. 05.56 కు తదుపరి ధ్రువ
కరణం: కౌలవ సా.  05.23 కు తదుపరి తైతుల
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.  10.31 - 11.18 కు & మ.  03.14 - 04.01 కు
వర్జ్యం: మ.  1.34 - 3.17 కు
అమృతకాలం: రా.  11.51 - 1.34 కు
సూర్యోదయం: ఉ.  6.35 కు
సూర్యాస్తమయం: సా.  6.22 కు

గురుబోధ:
మాఘమాసం త్రిమూర్త్యాత్మకమని శాస్త్రాలు చెపుతున్నాయి. మాఘపూర్ణిమ, అమావాస్య ఈ రెండు తిథులు బ్రహ్మస్వరూపాలనీ, మాఘమాసం శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకుని చతుర్దశి వరకు ఈ 14 రోజులు విష్ణుస్వరూపం. మాఘమాసంలో కృష్ణ పక్షంలో వచ్చే పాడ్యమి నుండి చతుర్దశి వరకు ఉండే తిథులు 14 శివస్వరూపాలు. ఈ కాలంలో వీలున్నంత వరకు సమయాన్ని త్రిమూర్తుల  ధ్యానానికి వినియోగించాలి. దత్తాత్రేయుడిని కనుక మనము స్మరణ చేస్తే ఆయనలో బ్రహ్మ, విష్ణువు, శివుడు ఉన్నారు. "దత్తాత్రేయం సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం" అని మార్కండేయ పురాణములో ఒక శ్లోకం ఉన్నది. అలా దత్తాత్రేయుడిని ధ్యానం చేసినా త్రిమూర్తులను పూజించిన వారు అవుతారు.

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం👇


శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచం👇


expand_less