కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 28 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము శుక్ల పక్షం
తిథి: ద్వాదశి రా.8.40 కు తదుపరి త్రయోదశి 01 రా.7.04 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: పునర్వసు ఉ.9.43 కు తదుపరి పుష్యమి 01 ఉ.8.39 కు
యోగం: శోభన మ.2:32 కు తదుపరి అతిగండ 01 మ.12:18 కు
కరణం: బాలవ రా.8:43 కు తదుపరి తైతుల 01 రా.7:09 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.12 - 8.58 కు
వర్జ్యం: సా.5.21 - 6.53 కు
అమృతకాలం: ఉ. 07.17 - 08.48 కు తదుపరి తె. 02.26 - 03.57 కు
సూర్యోదయం: ఉ. 6.38 కు
సూర్యాస్తమయం: సా. 6.18 కు
🕉️ ప్రదోషము, కంచి కామకోటి పీఠం శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారి ఆరాధన 🕉️
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు చేయాలి.
గురుబోధ:
ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయానికి ముందు 20ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. శివాలయంలో శివలింగం బయట కాని ఆలయ గోపురంపై కాని శివవిగ్రహం ఉంటే, ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించినవారికి శివపదం వస్తుంది. శివలింగం యొక్క పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం శివాశివుల ఐక్యరూపం.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial