కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 27 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసము కృష్ణపక్షం
తిథి: తదియ రా. 11.22 కు తదుపరి చతుర్థి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: హస్త తె. 5.20 కు తదుపరి చిత్త
యోగం: శూల సా. 04.25 కు తదుపరి గండ
కరణం: వణిజ మ. 12.35 కు తదుపరి విష్టి
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.57 - 09.44 కు & రా. 11.15 - 00.04 కు
వర్జ్యం: మ. 12.08 - 1.54 కు
అమృతకాలం: రా. 10.46 - 12.31 కు
సూర్యోదయం: ఉ. 6.36 కు
సూర్యాస్తమయం: సా. 6.22 కుగురుబోధ:
ఒకప్పుడు త్రిపురాసుర సంహారం కోసం దేవతలకి సాయం చేసిన ఆ తల్లే మంగళ చండిక. అమ్మవారిని ప్రతి మంగళవారం మంగళచండిక, మంగళగౌరి అనే పేర్లతో పిలుస్తూ , అమ్మని పూజిస్తే చాలా మంచిది. మహాదేవుడు స్వయంగా మంగళదేవతను పూజించి ఈ 3 శ్లోకాలతో స్తోత్రం చేసాడు. తీవ్రమైన కష్టాలలో కూరుకుపోయి పనులు అవ్వక యాతన పడుతున్నవారు, ఈ అపూర్వస్తోత్రం చేస్తే ఆ తీవ్ర కష్టాలు తొలగిపోతాయి. జీవితంలో ఒక స్థాయికి వెళ్ళి సర్వపతనం అయిపోయినవారు ఈ పవిత్రస్తోత్రం చదివితే మళ్ళీ ఉద్ధరింపబడుతారు.
యోగం లేక స్వగృహం విడిచిపెట్టి అద్దె ఇళ్ళలో ఉండేవారు 3 మంగళవారములు ఈ స్తోత్రమును దేవాలయంలో అమ్మవారి సన్నిధానంలో వీలైనన్నిసార్లు పారాయణం చేసుకొని, పుణ్యాత్ములకు యథాశక్తి దక్షిణ ఇస్తే వారి స్వగృహం వారికి తిరిగివస్తుంది. పోయిన ఇల్లు మళ్ళీ కొనుక్కునే శక్తి ప్రసాదిస్తుంది అమ్మ అనుగ్రహం.
ఈ స్తోత్రాన్ని మనసు చెదరకుండా శ్రద్ధతో చదివినా, విన్నా సకల శుభములు కలుగుతాయి. అమంగళం జరుగదు. పుత్రసంతానం కలిగి తీరుతుంది.
మంగళచండికా స్తోత్రం👇