Feb 26 2025ఫిబ్రవరి 26 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 26 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము కృష్ణ పక్షం

తిథి: త్రయోదశి ఉ.9.52 కు తదుపరి చతుర్దశి 27 ఉ.8.58 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: శ్రవణం సా.4.39 కు తదుపరి ధనిష్ఠ 27 సా.4.28 కు
యోగం: పరిఘ రా.2:57 కు తదుపరి శివ 27 రా.11:40 కు
కరణం: వణిజ ఉ.11:08 కు తదుపరి విష్టి రా.10.05 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: మ.12:05 - 12:52 కు
వర్జ్యం: రా.8.36-10.10కు
అమృతకాలం: ఉ. 07.28- 09.00 కు
సూర్యోదయం: ఉ. 6:25 కు
సూర్యాస్తమయం: సా. 6:01 కు

🕉️🕉️🕉️మహాశివరాత్రి - లింగోద్భవ సమయం - రా.12.03 - 12.52 కు🕉️🕉️🕉️
🕉️🕉️🕉️ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో పంచభూతాలకు ప్రతీక అయిన శ్రీ ప్రణవేశ్వరునికి, శ్రీ సత్యధర్మేశ్వరునికి, శ్రీ పద్మేశ్వరునికి, శ్రీ పుత్రదేశ్వరునికి, శ్రీ బ్రహ్మసూత్ర లింగేశ్వరునికి పూజ్య గురువుల ఆధ్వర్యవంలో మహారుద్రాభిషేకాలు అలాగే భాగ్యనగర్ శ్రీ ప్రణవపీఠం శ్రీ అరుణాచలేశ్వరునికి మహన్న్యాసపూర్వక రుద్రాభిషేకం, అన్నాభిషేకం, సహస్రపార్థివలింగార్చన, రుద్రహోమం వంటి అపూర్వ పూజాకార్యక్రమాలు జరుగుతాయి.🕉️🕉️🕉️

గురుబోధ:
నల్ల ఆవాలతో శివుని అభిషేకిస్తే శత్రువులు మిత్రులవుతారు. కందులతో కాని, కందిపూలతో కాని అభిషేకిస్తే ఆజన్మశత్రువు కూడా మిత్రుడవుతాడు. మిరియాలతో శివుని అభిషేకిస్తే ప్రాణాంతక శత్రువు మిత్రుడవుతాడు. నువ్వుగింజలతో అభిషేకిస్తే సకలపాపాల నుండి విముక్తి. వరితో వండిన అన్నంతో కాని రుద్రుని అభిషేకిస్తే రుద్రునికి అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు. పెసలతో శివుని అభిషేకిస్తే సుఖాలు లభిస్తాయి. నేతితో అభిషేకించేవానికి వంశాభివృద్ధి అవుతుంది. క్షయరోగం వంటివి తొలగడానికి తేనెతో శివుని అభిషేకించాలి. చెఱకు రసంతో అభిషేకిస్తే సర్వానందప్రాప్తి. ఈ విశేషాలు చదివినా, విన్నా, కైలాసప్రాప్తి, శివానుగ్రహప్రాప్తి అని స్వయంగా నందికేశుడు ఒకప్పుడు వివరించాడు - శివమహాపురాణం.
ఉత్తమోత్తమమైన శివలింగం ఏమిటి అంటే గురువు చేత ప్రతిష్ఠ చేయబడ్డ లింగం. గురుదేవుల సన్నధిలో జరిగే శివరాత్రి అభిషేకములు చూడక, వారి దర్శనం చేసుకోక, ఆయన అనుమతి లేక ఏ జ్యోతిర్లింగము దగ్గరికి వెళ్లినా సంపూర్ణ ఫలితం రాదు అని నందీశ్వరుడు చెప్పాడు.

expand_less