" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 26 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం శుక్ల పక్షము తిథి : సప్తమి (27వ తేదీ) తె. 04గం౹౹48ని౹౹ వరకు తదుపరి అష్టమి వారం : భానువారం (ఆదివారం) నక్షత్రం : భరణి ఉ. 08గం౹౹25ని౹౹ వరకు తదుపరి కృత్తిక యోగం : ఐంద్ర సా. 04గం౹౹27ని౹౹ వరకు తదుపరి వైధృతి కరణం : గరజి మ. 12గం౹౹33ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఈ రోజు సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : సా. 04గం౹౹31ని౹౹ నుండి 05గం౹౹17ని౹౹ వరకు వర్జ్యం : రా. 08గం౹౹46ని౹౹ నుండి 10గం౹౹25ని౹౹ వరకు అమృతకాలం : తె. 05గం౹౹41ని౹౹ నుండి 07గం౹౹11ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹25ని౹౹ కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹01ని౹౹ కు 👉🕉️భానుసప్తమి🕉️👈 గురుబోధ ఆదివారం మరియు సప్తమీ తిథి సూర్యునికి అత్యంత ప్రీతికరం. ఆ రెండు కలసి ఒకే రోజు వస్తే దానిని భానుసప్తమీ పర్వదినం అంటారు. ఈ రోజు చేసే ఏ కార్యమైనా వేల రెట్ల ఫలితం ఇస్తుంది. ఫాల్గునమాసం భానువారం సప్తమీతిథినాడు గోమతీ నదములో మధ్యాహ్నం వేళ స్నానం చేసినవారు కురుక్షేత్రంలో గ్రహణసమయంలో కోటిబంగారుకాసుల దానంతో సమానం.