Feb 25 2026ఫిబ్రవరి 25 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 25 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము శుక్ల పక్షం

తిథి: నవమి రా.2.57 కు తదుపరి దశమి 26 రా.12.43 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: రోహిణి మ.2.09 కు తదుపరి మృగశిర 26 మ.12.37 కు
యోగం: విష్కంభ తె.1:28 కు తదుపరి ప్రీతి 26 రా.10:33 కు
కరణం: బాలవ మ.3:46 కు తదుపరి తైతుల 26 మ.1:37 కు
రాహుకాలం: మ.12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: మ. 12.05 - 12.52 కు
వర్జ్యం: ఉ.ప.6.44 - 8.13 కు, రా.7.24 - 8.54 కు
అమృతకాలం: ఉ. 10.37 - 12.07 కు & తె. 03.54 - 05.24 కు
సూర్యోదయం: ఉ. 6.40 కు
సూర్యాస్తమయం: సా. 6.17 కు

గురుబోధ:
దుఃఖానికి మూలం జీవులు చేసే పాపాలు. పాపాలు కర్మను అనుసరిస్తాయి. మరలా మరలా కర్మలు చేసేలా జీవుడ్ని ప్రేరేపిస్తాయి. ఈ కర్మల నుండి బయటపడడం అంత తేలికకాదు. పోతన భాగవతంలో “తనువులు పెక్కైన చెడవు తనకర్మంబుల్” అంటారు. ఎన్ని జన్మలు ఎత్తినా కర్మబంధాల నుండి మాత్రం బయటపడలేక జీవులు నానాయాతనలు పడుతుంటారు. ఈ కర్మఫలాలు తొలగించి సకలదుఃఖవినాశనం చేసే దివ్యమాసం ఫాల్గునమాసం. ఫాల్గునమాసంలో ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె - ఈ మూడింటితో శివలింగాన్ని అభిషేకించిన వారికి తొంబది రోజుల్లో సంపదలు లభిస్తాయి

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less