కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 25 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, కృష్ణ పక్షం
తిథి: ద్వాదశి ఉ.10.47 తదుపరి త్రయోదశి 26 ఉ.9.52
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ సా.5.07 తదుపరి శ్రవణం 26 సా.4.39
యోగం: వ్యతీపాత ఉ.8:14 కు తదుపరి వరీయాన్ 26 ఉ.5:50 కు
కరణం: తైతుల మ.12.47 కు తదుపరి గరజి రా.12.03 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 09.00 - 09.46 కు, మ. 11.14 కు - 12.04 కు
వర్జ్యం: రా.9.01-10.35కు
అమృతకాలం: మ. 12.14- 1.48 కు
సూర్యోదయం: ఉ. 6:31 కు
సూర్యాస్తమయం: సా. 5:51 కు
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీపారణ ఈరోజు ఉదయం 10.30లోపు పూర్తి చేయాలి.
🕉️శ్రీశ్రీశ్రీ కంచి శంకర విజయేంద్రసరస్వతీస్వామి జయంతి, ప్రదోషం🕉️
గురుబోధ:
శివరాత్రి నాడు ఉపవాసం ఉండి, శివలింగాన్ని పూజించాలి. జాగరణ చేసి, లింగాన్ని అభిషేకించండి అన్నాడు శివుడు. శివరాత్రి నాడు లింగం రోజంతా పూజించవచ్చు. సూర్యోదయము నుండి మరునాడు సూర్యోదయము వరకు ఎప్పుడైనా పూజించవచ్చు. కాని అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలములో ఈశ్వరుడిని పంచామృతాలతో, జలధారలతో అభిషేకించండి. సర్వశుభాలు కలుగుతాయి.