కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 25 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసము కృష్ణపక్షం
తిథి: పాడ్యమి రా. 7.15 కు తదుపరి విదియ
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పుబ్బ రా. 7.15 కు తదుపరి ఉత్తర
యోగం: సుకర్మ మ. 02.29 కు తదుపరి ధృతి
కరణం: బాలవ ఉ. 07.16 కు తదుపరి కౌలవ
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 04.47 - 05.34 కు
వర్జ్యం: ఉ. 6.36 - 8.23 కు
అమృతకాలం: సా. 5.13 - 7.00 కు
సూర్యోదయం: ఉ. 6.38 కు
సూర్యాస్తమయం: సా. 6.21 కు
🕉️ గురుపాడ్యమి🕉️
గురుబోధ:
అద్భుతమైన దత్తాత్రేయ వజ్రకవచం నిత్యం వినాలి. ఒక 40 రోజుల పాటు పారాయణం చేస్తే దత్తాత్రేయుడు మీ ఇంట్లో కొలువుంటాడు. ఇది దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి, దలాదునికి గోపీకుండం దగ్గర చెప్పాడు. ఇలా చెబుతుండగా దూరశ్రవుడు అనే ఒక బోయవాడు (భిల్లుడు) వినడంతో అతనికి సమస్త పాపపరిహారమై శాశ్వత వైకుంఠం లభించింది. అంతటి అపూర్వ శక్తిమంతమైన కవచం ఇది.
దత్తాత్రేయ వజ్రకవచం👇