Feb 25 2023ఫిబ్రవరి 25 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఫిబ్రవరి 25 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం శుక్ల పక్షము

తిథి : షష్ఠి (26వ తేదీ) తె. 04గం౹౹49ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం :  అశ్విని ఉ. 08గం౹౹12ని౹౹ వరకు తదుపరి భరణి
యోగం : బ్రహ్మ  సా. 05గం౹౹18ని౹౹ వరకు తదుపరి ఐంద్ర 
కరణం :  కౌలవ మ. 12గం౹౹19ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 06గం౹౹27ని౹౹ నుండి 08గం౹౹00ని౹౹ వరకు
వర్జ్యం : సా. 05గం౹౹53ని౹౹ నుండి 07గం౹౹30ని౹౹ వరకు
అమృతకాలం : తె. 04గం౹౹04ని౹౹ నుండి 05గం౹౹34ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹27ని౹౹ కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹00ని౹౹ కు

గురుబోధ 
శ్రీ స్కాందపురాణం వైప్ణవఖండం చిట్టచివరి ఘట్టంలో ఐదు అధ్యాయములలో వేదవ్యాసులవారు భాగవత మహిమను చెప్పారు. పద్మ పురాణంలో కూడా భాగవతమహిమ ఉంటుంది. భాగవతమహిమ లేని పురాణం లేదు. రోజూ భాగవతం అనే గ్రంథం చేత్తో ఎత్తి నెత్తిమీద పెట్టుకుంటే శ్రీకృష్ణుడ్ని శిరస్సు మీద మోసినట్లే. భాగవతమే భగవంతుడని గ్రహించిన వాడే పరమభక్తుడు. కృష్ణుడే  భాగవతం, భాగవతమే కృష్ణుడు. ఆ ఒక్క స్వరూపం తప్ప మరొకటి లేదు. అనగా శ్రీమద్భాగవతాన్ని అత్యంత భ క్తిశ్రద్ధలతో విను, పారాయణము చెయ్యి, ఇతరులకు వినిపించు, ఈ భాగవతమే నీకు కృష్ణుడ్ని అందిస్తుంది. సచ్చిదానంద లక్షణ స్వరూపమే భాగవతమనే అపూర్వ గ్రంథం.
మన పేరు మీద మన పిల్లల పేరు మీద జీవితంలో ఒక్కసారైనా భాగవత సప్తాహం చేయించుకోవడం సర్వశుభప్రదం.

expand_less