Feb 24 2025ఫిబ్రవరి 24 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 24 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము కృష్ణ పక్షం

తిథి: ఏకాదశి ఉ.10.56 కు తదుపరి ద్వాదశి 25 ఉ.10.47 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: పూర్వాషాఢ సా.4.44 కు తదుపరి ఉత్తరాషాఢ 25 సా.5.07 కు
యోగం: సిద్ధి ఉ.10:04 కు తదుపరి వ్యతీపాత 25 ఉ.8:14 కు
కరణం: బాలవ మ.1.45 కు తదుపరి కౌలవ రా.1.22 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12:50 - 01:41 కు, మ.03:09 - 03:59 కు
వర్జ్యం: రా.12.51-2.28 కు
అమృతకాలం: మ. 2.07- 03.44 కు
సూర్యోదయం: ఉ. 6:31 కు
సూర్యాస్తమయం: సా. 5:51 కు

🕉️మాఘ కృష్ణ ఏకాదశి🕉️
ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ద్వాదశీపారణ మంగళవారం (ఫిబ్రవరి 25) ఉదయం 10.30లోపు పూర్తి చేయాలి.

గురుబోధ:
ఏకాదశి అంటే హరిహరులకు ప్రీతి. ఏకాదశి అంటేనే యమకింకరులు వణికిపోతారు. ఏకాదశి నాడు : 1) ఒక వెయ్యీ ఎనిమిది తులసీదళాలతో, బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించినవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. 2) చామంతిపువ్వులు, తులసీదళాలతో విష్ణువును పూజించినవాడు మంచిపదవిని పొందుతాడు.
శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=uV_8ADVFB3pZdXiy
శివరాత్రికి ఉపవాసం చేసి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి, తన శక్తిననుసరించి నన్ను పూజించిన వ్యక్తి ఒక ఏడాది పాటు నన్ను నిత్యం పూజించిన ఫలితం పొందుతాడు. దానివల్ల ఆ వ్యక్తికి నిరంతర శుభాలు కలుగుతాయి. చంద్రుడు ఉదయించగానే సముద్రం ఎలా ఉప్పొంగుతుందో, శివరాత్రి రాగానే, శివధర్మం అభివృద్ధి పొందుతుంది. అందువల్ల శివరాత్రి నాడు శివప్రతిష్ఠా కార్యక్రమం, కల్యాణోత్సవాలు జరిపిస్తే, సకల మంగళాలూ లభిస్తాయి.

expand_less