" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 24 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం శుక్ల పక్షము తిథి : పంచమి (25వ తేదీ) తె. 05గం౹౹18ని౹౹ వరకు తదుపరి షష్ఠి వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం : రేవతి ఉ. 08గం౹౹27ని౹౹ వరకు తదుపరి అశ్విని యోగం : శుక్ల సా. 06గం౹౹48ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ కరణం : బవ మ. 12గం౹౹56ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹47ని౹౹ నుండి 09గం౹౹33ని౹౹ & మ. 12గం౹౹38ని౹౹ నుండి 01గం౹౹25ని౹౹ వర్జ్యం : తె. 04గం౹౹14ని౹౹ నుండి 05గం౹౹49ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 06గం౹౹27ని౹౹ నుండి 07గం౹౹40ని౹౹ వరకు & రా. 01గం౹౹04ని౹౹ నుండి 02గం౹౹39ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹27ని౹౹ కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹00ని౹౹ కు గురుబోధ అంత్యకాలంలో హరినామస్మరణం చేస్తే భగవత్ సన్నిధానం, ఉత్తమజన్మలు ప్రాప్తిస్తాయి. కానీ అలా చెయ్యడం అంత తేలిక కాదు. అందుకే శివ, రామ, కృష్ణ, గురు ఇలా ఏదో ఒక భగవత్ నామాన్ని నిరంతరం తింటున్నా, తిరుగుతున్నా, తాగుతున్నా, పడుకున్నా సర్వకాల సర్వావస్థలలో జపించుకుంటూ ఉండాలి. తద్వారా మనసుకు నామస్మరణం అలవాటు అవుతుంది, చివరదశలో నామం పలకగలుగుతాము.