Feb 23 2023ఫిబ్రవరి 23 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఫిబ్రవరి 23 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం శుక్ల పక్షము

తిథి : తదియ ఉ. 07గం౹౹45ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం :  ఉత్తరాభాద్ర ఉ. 09గం౹౹07ని౹౹ వరకు తదుపరి రేవతి
యోగం : శుభ  రా. 08గం౹౹58ని౹౹ వరకు తదుపరి శుక్ల 
కరణం :  వణిజ మ. 02గం౹౹23ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 10గం౹౹20ని౹౹ నుండి 11గం౹౹06ని౹౹ & మ. 02గం౹౹57ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹
వర్జ్యం : రా. 08గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹50ని౹౹ వరకు
అమృతకాలం : తె. 04గం౹౹37ని౹౹ నుండి 06గం౹౹07ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹27ని౹౹ కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹00ని౹౹ కు

గురుబోధ 
ఎన్నో వేలజన్మల సంస్కారం, పుణ్యం ఉంటే గాని తీర్థయాత్రలు చేయలేము. పైగా సద్గురువులతో యాత్ర చేసే భాగ్యం మరింత అదృష్టం. అటువంటి పుణ్య ప్రదేశాలలో ఇతరుల పై చాడీలు చెప్పడం, కోపగించుకోవడం, ఏదో ఒక వంక పెట్టి అసంతృప్తి వ్యక్తపరచడం, విరుచుకుపడడం చేయరాదు. సాధ్యమైనంత వరకు ఏదో ఒక నామ, జప, పారాయణం, పురాణ శ్రవణంతో కాలం గడపాలి.     
తీర్థయాత్రలు చేయడం కుదరనప్పుడు తీర్థయాత్రలు చేసేవారికి  ధన,వస్తు రూపములో ఎంతో కొంత సహాయం చేసినవారికి కూడా ఆ తీర్థయాత్రలు చేసిన ఫలితం కొంత వస్తుంది.  

expand_less