Feb 22 2026ఫిబ్రవరి 22 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 22 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము శుక్ల పక్షం

తిథి: పంచమి మ.12.09 కు తదుపరి షష్ఠి 23 ఉ.10.03 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: అశ్విని రా.7.01 కు తదుపరి భరణి 23 సా.5.33 కు
యోగం: బ్రహ్మ ఉ.10:18 కు తదుపరి ఐంద్ర 23 ఉ.7:23 కు
కరణం: బాలవ ఉ.11:10 కు, కౌలవ రా.10:11 కు తదుపరి గరజి 23 రా.8:06 కు
రాహుకాలం: సా. 4.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 4.43 - 5.30 కు
వర్జ్యం: మ.3.13 - 4.44 కు, తె.4.02 - 5.32 కు
అమృతకాలం: ఉ.11.03 - 12.34 కు
సూర్యోదయం: ఉ. 6.42 కు
సూర్యాస్తమయం: సా. 6.16 కు

గురుబోధ:
మలిన వస్త్రాలు ధరించుట, దంతాలను శుభ్రం చేసుకొనకుండుట, ఎక్కువ తిండి తినుట, కఠోరంగా పలుకుట, సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో నిద్రించుట, ఈ పనులను చేసేవాడు సాక్షాత్తు చక్రపాణి అయిన విష్ణువయినప్పటికీ లక్ష్మి అతడిని విడిచిపెడుతుంది - శ్రీ గరుడపురాణం.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial2

expand_less