కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 22 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము కృష్ణ పక్షం
తిథి: నవమి ఉ.9.43 తదుపరి దశమి 23 ఉ.10.29
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: జ్యేష్ఠ మ.2.30 కు తదుపరి మూల 23 మ.3.47
యోగం: హర్షణ ఉ.11:55 కు తదుపరి వజ్ర 23 ఉ.11:18 కు
కరణం: గరజి మ.1.19 కు తదుపరి వణిజ రా.1.43 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.15 - 09.01 కు
వర్జ్యం: రా.10.53-12.39 కు
అమృతకాలం: ఉ. 08.13 - 09.56 కు
సూర్యోదయం: ఉ. 6:31 కు
సూర్యాస్తమయం: సా. 5:51 కు
🕉️దాసనవమి - ఛత్రపతి శివాజీ మహరాజ్ గారి గురువులు శ్రీ సమర్థ రామదాస స్వామి వారి ఆరాధన. మాఘ బహుళ నవమి (దాసనవమి)🕉️
గురుబోధ:
శివుడు గురురూపంలో భక్తుల గుణాలు తొలగించి జ్ఞానం ఇస్తాడు. సత్త్వ రజస్తమో గుణాలంటే ఏమిటో తెలియజెప్పి, శివతత్త్వం తెలియజేసే మహాత్ముడే గురువు. అందుకే శివుడు, గురువుగారి శరీరమే శివలింగం అని చెప్పాడు. గురుశుశ్రూష చేసేవాడికి పరమేశ్వరలింగ పూజా ఫలం సంపూర్ణంగా లభిస్తుంది. - శ్రీ శివమహాపురాణం.