కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 22 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసము శుక్లపక్షం
తిథి: త్రయోదశి మ. 1.46 కు తదుపరి చతుర్దశి
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: పుష్యమి సా. 5.16 కు తదుపరి ఆశ్లేష
యోగం: సౌభాగ్య మ. 12.13 కు తదుపరి శోభన
కరణం: తైతుల మ. 01.21 కు తదుపరి గరజి
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.33 - 11.20 కు & మ. 03.13 - 04.00 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: ఉ. 10.25 - 12.07 కు
సూర్యోదయం: ఉ. 6.39 కు
సూర్యాస్తమయం: సా. 6.20 కు
🕉️ భద్రాచల రామదాసు జయంతి 🕉️
దాశరథీ శతకం శ్లోకం - 1👇దాశరథీ శతకం - మొత్తం ప్లేలిస్ట్👇గురుబోధ:
నిత్యం ఏదో ఒక భాగవన్నామము నిరంతరం స్మరించడం అలవాటు చేసుకోవాలి. ఉదా౹౹ రామభక్తులు ఎవరినైనా కలిసినప్పుడు "జై శ్రీరామ్ " అని సంబోధించి మాట్లాడుతారు. అలాగే "జై గురుదత్త , హరే కృష్ణ, రాధేకృష్ణ, పాండురంగ , జై గణేశ , శివశివ , శ్రీమాత ఇలా ఎదో ఒక ఇష్టమైన నామమును పట్టుకోవాలి. అదే మనల్ని రక్షిస్తుంది. తరింపచేస్తుంది.
🕉️ త్రిమాతృశక్తి ధామం - ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో ఏకాదశ వార్షికోత్సవాలు, శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామి వారి ప్రతిష్ఠాపన మహోత్సవాల ప్రారంభం 🕉️