Feb 22 2023ఫిబ్రవరి 22 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఫిబ్రవరి 22 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం శుక్ల పక్షము

తిథి : విదియ ఉ. 09గం౹౹28ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం :  పూర్వాభాద్ర ఉ. 10గం౹౹07ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం : సాధ్య  రా. 11గం౹౹47ని౹౹ వరకు తదుపరి శుభ 
కరణం :  తైతుల సా. 04గం౹౹36ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹52ని౹౹ నుండి 12గం౹౹38ని౹౹
వర్జ్యం : రా. 07గం౹౹19ని౹౹ నుండి 08గం౹౹51ని౹౹ వరకు
అమృతకాలం : తె. 04గం౹౹42ని౹౹ నుండి 06గం౹౹03ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹28ని౹౹ కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹00ని౹౹ కు

గురుబోధ 

భాగవత గ్రంథాన్ని తలపై పెట్టుకొని గోవిందుడి నామస్మరణ చేస్తూ విష్ణ్వాలయంలో 3 ప్రదక్షిణలు చేసి భక్తుడి దానం ఇస్తే, గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువును మోసిన ఫలం లభిస్తుంది. భూమండలం, స్వర్గ, పాతాళ లోకాలు (త్రిలోకాలు) ఒకవైపు, భాగవతమొక్కటీ మరొకవైపు త్రాసులో పెడితే భాగవతమే బరువు తూగుతుంది, అంటే ఇక దాని శక్తి ఊహించలేనిది. సమస్తవేదాలు చదివినఫలం కూడా, సర్వశాస్త్ర ఫలసారమైన, భాగవతానికి సరితూగదు. భాగవతం వింటే ముక్తినిస్తుంది. భగవంతునికి భాగవతానికి తేడా లేదు. - శ్రీ స్కాందపురాణం

expand_less