" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 21 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం శుక్ల పక్షము తిథి : పాడ్యమి ఉ. 11గం౹౹27ని౹౹ వరకు తదుపరి విదియ వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : శతభిషం ఉ. 11గం౹౹25ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర యోగం : శివ ఉ. 06గం౹౹57ని౹౹ వరకు తదుపరి సిద్ధ కరణం : బవ ఉ. 09గం౹౹04ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹44ని౹౹ నుండి 09గం౹౹34ని౹౹ & రా. 10గం౹౹58ని౹౹ నుండి 11గం౹౹47ని౹౹ వర్జ్యం : సా. 05గం౹౹28ని౹౹ నుండి 06గం౹౹59ని౹౹ వరకు అమృతకాలం : రా. 02గం౹౹33ని౹౹ నుండి 04గం౹౹04ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹28ని౹౹ కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹00ని౹౹ కు గురుబోధ భగవంతుడు కోరితే ఏదైనా ఇస్తాడు కానీ భక్తిని ఇవ్వడం అంత సాధ్యం కాదని అంటాడు- బ్రహ్మవైవర్త పురాణం పూర్వం ఐశ్వర్యుడు అనే గంధర్వరాజు వశిష్ఠమహర్షి దగ్గర విష్ణుమంత్రం , శివకవచం, శివస్తోత్రం వంటివి ఉపదేశం తీసుకుని కఠోర తపస్సు చేసాడు. తపస్సుకు మెచ్చిన శివుడు గంధర్వరాజుతో, నిన్ను ఇంద్రలోకానికి అధిపతిని చేయనా, బ్రహ్మ లోకానికి అధిపతిని చేయనా లేదా ఏ కోరిక ఉన్నా తీరుస్తానని అడుగగా, ఆ రాజు, స్వామీ ! ఆ పదవులు ఏవీ శాశ్వతం కాదని నేను ఎఱుగుదును. నాకు ఎల్లవేళలా హరిభక్తిని మఱియు హరిభక్తి పరాయణుడు అయిన పుత్రుని ఇమ్మని కోరతాడు. భక్తిని ప్రసాదించడం అంత సులభం కాదు. ఈ తపస్సు సరిపోదు. అయినా నువ్వు మీ గురువులైన వశిష్ఠుని గురుభక్తితో సేవించి మంత్రం ఉపదేశం గా తీసుకుని శివకేశవులను సమంగా ఆరాధించావు కాబట్టి నీకు భక్తి మఱియు ఉపబర్హణుడు (నారదుడు తన పూర్వ జన్మలో ఒక గంధర్వుడు) అనే పుత్రుడు కలుగుతాడని వరము ఇస్తాడు. ఆ ఉపబర్హణుడు గొప్ప తపస్సు చేస్తాడు. ఒకసారి బ్రహ్మ సభలో చేసిన పొరపాటు వల్ల తరువాతి జన్మలో దాసీపుత్రుడిగా పుట్టి సన్యాసులను, గురువులను సేవించి సకల పురాణములని శ్రవణం చేసి, మంత్రోపదేశం పొంది తరువాత జన్మలో సకల లోక పూజ్యుడైన నారదునిగా అవతరిస్తాడు. కాబట్టి గురువుల మీద, భగవంతుని మీద సంపూర్ణ భక్తి కలగి ఈ జన్మలోనే తరించడము అంత సులభ సాధ్యం కాదు. నిష్ఠ, శ్రద్ధ సడలకుండా ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి.