కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 20 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము కృష్ణ పక్షం
తిథి: సప్తమి ఉ.6.53 కు తదుపరి అష్టమి 21 ఉ.8.38 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: విశాఖ ఉ.10.39 కు తదుపరి అనూరాధ 21 మ.12.46 కు
యోగం: ధ్రువ ఉ.11:33 కు తదుపరి వ్యాఘాత 21 ఉ.11:58 కు
కరణం: బవ ఉ.8:58 కు తదుపరి బాలవ రా.11.02 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.34 - 11.20 కు, మ. 3.11 - 3.57 కు
వర్జ్యం: మ.3.00-4.44 కు
అమృతకాలం: రా.1.28 - 3.12 కు
సూర్యోదయం: ఉ. 6:31 కు
సూర్యాస్తమయం: సా. 5:51 కు
🕉️అవధూత శ్రీ శ్రీ శ్రీ గజానన్ మహరాజ్ ప్రకటితమైన దినం🕉️
గురుబోధ:
అన్నద్రోహం, గురుద్రోహం, బ్రహ్మద్రోహం న కారయేత్ - అన్నం పెట్టినవారిని, బ్రహ్మజ్ఞానులను ద్వేషించేవారిని, గురుద్రోహులను బ్రహ్మనుండి పుట్టిన పిశాచములు పట్టుకుంటాయి. అందుకే ఎప్పుడూ జాగరూకతతో శివనామస్మరణంతో మన బుద్ధి, మనసు, ఆత్మ పవిత్రంగా ఉండేలా ప్రదక్షిణలు, పూజ, అర్చన, అభిషేకములు వీలైనంత తరచుగా చేసుకుంటూ ఉండాలి, కుదరని పక్షంలో ఈ భగవత్ కార్యక్రమాలు చేసుకునేవారికి వీలైనంత సహాయం చేయాలి. - శ్రీ శివమహాపురాణం.