Feb 20 2024ఫిబ్రవరి 20 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 20 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసము శుక్లపక్షం

తిథి: ఏకాదశి మ.  12.04 కు తదుపరి ద్వాదశి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ఆర్ద్ర మ.  2.22 కు తదుపరి పునర్వసు
యోగం: ప్రీతి ఉ.  11.46 కు తదుపరి ఆయుష్మాన్
కరణం: విష్టి ఉ.  08.55 కు తదుపరి బవ
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.  09.00 - 09.47 కు & రా.  11.16 - 12.05 కు
వర్జ్యం: రా.  2.58 - తె. 4.38  కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ.  6.41 కు
సూర్యాస్తమయం: సా.  6.20 కు

🕉️ భీష్మ ఏకాదశి 🕉️

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ(బుధవారం)  ఉదయం  చేయచ్చు.

గురుబోధ:
భీష్మపితామహుడు పరమధర్మమూర్తి. భీష్మ ఏకాదశి నాడు భీష్ముని గురించి వినడం, భీష్ముని తలచుకోవడం సర్వశుభప్రదం. నేడు వాసుదేవశతనామాలను,  విష్ణుసహస్రనామ  శ్రవణం(పారాయణం) చేయడం విశేషఫలితాలను ప్రసాదిస్తుంది.

శ్రీ వాసుదేవ శతనామాలు (100) 👇


expand_less