" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 20 2023 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం కృష్ణ పక్షము
తిథి : అమావాస్య మ. 01గం౹౹38ని౹౹ వరకు తదుపరి పాడ్యమివారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : ధనిష్ఠ మ. 12గం౹౹54ని౹౹ వరకు తదుపరి శతభిషంయోగం : పరిఘ ఉదయం 11గం౹౹03ని౹౹ వరకు తదుపరి శివకరణం : నాగ మ. 12గం౹౹35ని౹౹ వరకు తదుపరి కింస్తుఘ్నరాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹38ని౹౹ నుండి 01గం౹౹24ని౹౹ & మ. 02గం౹౹56ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹
వర్జ్యం : రాత్రి 07గం౹౹42ని౹౹ నుండి 09గం౹౹12ని౹౹ వరకు
అమృతకాలం : తెల్లవారి 04గం౹౹46ని౹౹ నుండి 06గం౹౹16ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹29ని౹౹ కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹59ని౹౹ కు
🕉️👉సోమవతీ అమావాస్య👈🕉️
గురుబోధ
సోమవారం నాడు అమావాస్య తిథి వస్తే దానిని సోమవతీ అమావాస్య అంటారు. పూర్వం నిరీశ్వర యాగమైన దక్షయజ్ఞానికి వెళ్ళిన చంద్రుడు వీరభద్రునిచే శిక్షింపబడి, ఆరోగ్యం కోసం సోమవతీ అమావాస్య నాడే ఈశ్వరాభిషేకం చేసుకొని సంపూర్ణ అరోగ్యం పొందాడు. ఈ రోజున పంచారామాలను దర్శించుకున్నవారు, అభిషేకం చేయించుకున్నవారు సంపూర్ణ అరోగ్యవంతులవుతారు.
కుల, లింగ, వయో భేదాలు లేకుండా అందరూ సూర్యోదయానికి ముందే లేచి రాహుకాలం (ఉ.7.30 నుండి 9.00)లో శివునికి అభిషేకం చేసుకొని, బిల్వపత్రాలు, తెల్లని, పసుపుపచ్చని పుష్పాలతో పూజించినవారికి పిల్లల భవిష్యత్తు బాగుండి, భార్యాభర్తల మధ్య ఐకమత్యం సిద్ధిస్తుంది. శివపురాణం ప్రకారం ఈరోజు అశ్వత్థవృక్షానికి (రావిచెట్టుకి) చేసే ప్రదక్షిణ, పూజ వలన సకల శుభాలు పొందుతారు. శివపంచక్షరీ స్తోత్రం ఈరోజు పఠిస్తే ఎంతో మంచిది, ఈశ్వరకటాక్షం పొందుతారు.
పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. పితృ దేవతలకు శుక్ల పక్షము, కృష్ణ పక్షము కలిస్తే ఒక రోజు (మనకు 30 రోజులు). అందుకే ప్రతి నెల అమావాస్య నాడు వారికి తప్పక తర్పణాలు, స్వయంపాకం దానం ఇవ్వడం చేయాలి.