Feb 19 2026ఫిబ్రవరి 19 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 19 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము శుక్ల పక్షం

తిథి: విదియ సా.4.43 కు తదుపరి తదియ 20 మ.3.33 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: పూర్వాభాద్ర రా.9.49 కు తదుపరి ఉత్తరాభాద్ర 20 రా.9.13 కు
యోగం: సాధ్య సా.6:23 కు తదుపరి శుభ 20 మ.3:50 కు
కరణం: కౌలవ సా.3:59 కు తదుపరి గరజి 20 మ.2:38 కు
రాహుకాలం: మ. 01.30 – 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.34 – 11.20 కు, మ. 3.11 – 3.57 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ. 12.59 – 02.33 కు
సూర్యోదయం: ఉ. 6.44 కు
సూర్యాస్తమయం: సా. 6.15 కు

🛕🕉️ శ్రీ రామకృష్ణపరమహంస జయంతి, శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి 🛕🕉️

గురుబోధ:
🔆🛕🕉️ ఈ శతాబ్దపు మహానుభావుల జాబితాలో శ్రీ రామకృష్ణ పరమహంస గారు అగ్రగణ్యులుగా ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. వారి పేరు తెలియని భారతీయుడు ఉండడు. కలకత్తాలోని దక్షిణేశ్వర్ లో కాళీమాతను సాక్షాత్తు తల్లిగా భావించి పూజించి, అమ్మవారితో సంభాషించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు. శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ శారదామాత వారి శిష్యులు అయిన శ్రీ వివేకానంద స్వామి వారు మన సనాతనధర్మ ఆచరణమును, ఎన్నో వేదాంతములను అందరికీ సులభంగా అర్థం అయ్యే విధంగా బోధించి కోట్లాదిమందిని ప్రభావితం చేసారు. శ్రీ రామకృష్ణ మఠం 125 సంవత్సరములగా దేశ విదేశాల్లో భక్తులలో ఆధ్యాత్మిక చింతన మొలకెత్తేవిధంగా సేవలు అందిస్తున్నారు. అంతటి మహనీయులు అయిన శ్రీ రామకృష్ణ పరమహంస గారి జయంతి సందర్భంగా వారి దివ్యాశీస్సుల మన పై ఎప్పుడూ ఉండాలని ప్రార్థిద్దాం.
🔆🛕🕉️400 సంవత్సరాల క్రితం కొందరు దుష్టులు, ఇతర మతస్థులు ముఖ్యంగా తురకలు ఎన్నో రాజ్యాలను, ఆలయాలును, స్త్రీలను, హిందువులను దారుణంగా ఊచకోత కోసి హింసతో భారతమాతకు కన్నీరు తెప్పించారు. అప్పుడే 1630 ఫిబ్రవరి 19 నాడు భరత మాత ముద్దుబిడ్డగా అవతరించి మనలని రక్షించిన వీరుడే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్. తన తల్లి జీజాబాయి నేర్పిన ధైర్యం, రామాయణ భారత కథలతో ఉన్నత వ్యక్తిత్వాన్ని, వీరత్వాన్ని సాధించి మరాఠా సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసి సమర్థ రామదాసును తన గురువుగా భావించేవారు. ఈ మాత్రం మన ధర్మం నిలబడి ఉందంటే అది కేవలం వారి త్యాగఫలితమే అని శ్రీశ్రీశ్రీ కంచి పరమాచార్య స్వామి వారు కూడా శివాజీ మహారాజ్ కు ప్రణామములు అందించారు. వారి దేశభక్తి, దూరదృష్టి మనం ఆచరణలో పెట్టుకోవాలి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less