కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 19 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము కృష్ణ పక్షం
తిథి: సప్తమి పూర్తి తదుపరి అష్టమి
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: స్వాతి ఉ.8.11 కు తదుపరి విశాఖ 20 ఉ.10.39 కు
యోగం: వృద్ధి ఉ.10:48 కు తదుపరి ధ్రువ 20 ఉ.11:33 కు
కరణం: విష్టి రా.8.48 కు తదుపరి బవ 20 ఉ.8:58 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: మ.12:06 - 12:52 కు
వర్జ్యం: మ.2.25 - 4.11 కు
అమృతకాలం: రా. 03.39 - 05.27 కు
సూర్యోదయం: ఉ. 6:31 కు
సూర్యాస్తమయం: సా. 5:51 కు
🕉ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి🕉
గురుబోధ:
పిల్లలకు లౌకిక విద్యలతో పాటు బాల్యంలోనే మన ఆచారాలు, పురాణములు, సంగీత సాహిత్య కళలు ఇతర శాస్త్రముల మీద అవగాహన ఉండేట్లు చేయాలి. అవే వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. శివాజీ మహారాజ్ తల్లి జిజియాబాయి శివాజీకి దేశభక్తి, సనాతనధర్మాసక్తి చిన్నపటి నుండి నూరిపోసి మనం నేటికీ ఆయనను తలచుకుని స్ఫూర్తిపొందేలా పెంచింది.