కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 19 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసము శుక్లపక్షం
తిథి: దశమి ఉ. 11.58 కు తదుపరి ఏకాదశి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: మృగశిర మ. 1.38 కు తదుపరి ఆర్ద్ర
యోగం: విష్కంభ మ. 12.01 కు తదుపరి ప్రీతి
కరణం: గరజి ఉ. 08.49 కు తదుపరి వణిజ
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.53 - 01.40 కు & మ. 03.13 - 04.00 కు
వర్జ్యం: రా. 10.17-11.56 కు
అమృతకాలం: తె. 4.04 - 5.43 కు
సూర్యోదయం: ఉ. 6.41 కు
సూర్యాస్తమయం: సా. 6.19 కుగురుబోధ:
సకల వేదములు శ్రద్ధతో వినటం వల్ల పారాయణం చేయటం వల్ల ఇతరులకు బోధించడం వల్ల వచ్చే ఫలితం మాఘమాసం మొత్తం స్నానం చేయటం వల్ల పొందుతారు. స్నానం చేసాక యథాశక్తి దానం చేస్తే మంచిది. ఈశ్వరానుగ్రహం వల్ల అనేక దోషాలనుంచి విముక్తి పొందుతారు. మాఘమాసం అంతా భక్తిశ్రద్ధలతో స్నానం చేస్తే సర్వతీర్ధములు తిరగడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. మాఘమాసంలో సూర్యోదయానికి కొద్దిగా ముందు సూర్యుడు ఎర్రగా ఉదయించబోతున్నప్పుడు స్నానం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది.
ఆర్ద్ర నక్షత్రం శివునికి అత్యంత ప్రీతికరమైనది. సోమవారం ప్రదోషవేళ ఆర్ద్ర నక్షత్రం ఉన్న ఈ రోజున చేసే శివారాధన, శివపూజ, శివాభిషేకం విశేషమైన శివానుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఈ సమయంలో శివసహస్రనామం వినడం సర్వశుభాలను లభింపజేస్తుంది.
శివసహస్రనామ స్తోత్రమ్👇