" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 19 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం కృష్ణ పక్షము తిథి : చతుర్దశి మ. 03గం౹౹58ని౹౹ వరకు తదుపరి అమావాస్య వారం : భానువారం (ఆదివారం) నక్షత్రం : శ్రవణం మ. 02గం౹౹33ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ యోగం : వరీయాన్ మ. 03గం౹౹20ని౹౹ వరకు తదుపరి పరిఘ కరణం : శకుని సాయంత్రం 04గం౹౹18ని౹౹ వరకు తదుపరి చతుష్పాద రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : సాయంత్రం 04గం౹౹29ని౹౹ నుండి 05గం౹౹15ని౹౹ వర్జ్యం : సాయంత్రం 06గం౹౹06ని౹౹ నుండి 07గం౹౹35ని౹౹ వరకు అమృతకాలం : తెల్లవారి 03గం౹౹12ని౹౹ నుండి 04గం౹౹41ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹29ని౹౹ కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹59ని౹౹ కు గురుబోధ ఆలయంలో ఆత్మప్రదక్షిణ అన్నప్పుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు. గుడి చుట్టూ ప్రదక్షిణం చేయాలి. విష్ణ్వాలయంలో 4 సంఖ్య తో ప్రదక్షిణలు(4,8,12,16...) అమ్మవారు మరియు శివాలయంలో 3 సంఖ్య తో ప్రదక్షిణలు (3,6,9,12....)చేయాలని శాస్త్రము.