" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 18 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం కృష్ణ పక్షము తిథి : త్రయోదశి రా. 06గం౹౹32ని౹౹ వరకు తదుపరి చతుర్దశి వారం : స్థిరవారం (శనివారం) నక్షత్రం : ఉత్తరాషాఢ సాయంత్రం 04గం౹౹25ని౹౹ వరకు తదుపరి శ్రవణం యోగం : వ్యతీపాత రాత్రి 07గం౹౹36ని౹౹ వరకు తదుపరి వరీయాన్ కరణం : గరజి ఉదయం 09గం౹౹51ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 06గం౹౹30ని౹౹ నుండి 08గం౹౹02ని౹౹ వర్జ్యం : తెల్లవారి 05గం౹౹07ని౹౹ నుండి 06గం౹౹30ని౹౹ వరకు & రాత్రి 08గం౹౹06ని౹౹ నుండి 09గం౹౹34ని౹౹ వరకు అమృతకాలం : ఉదయం 10గం౹౹27ని౹౹ నుండి 11గం౹౹57ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹30ని౹౹ కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹58ని౹౹ కు 🕉️👉మహాశివరాత్రి, శనిత్రయోదశి👈🕉️ గురుబోధ ఉత్తమోత్తమమైన శివలింగం ఏమిటి అంటే గురువు చేత ప్రతిష్ఠ చేయబడ్డ లింగం. గురులింగం అన్నిటికంటే గొప్పది. గురుదేవుల సన్నధిలో జరిగే శివరాత్రి అభిషేకములు చూడక, వారి దర్శనం చేసుకోక, ఆయన అనుమతి లేక ఏ జ్యోతిర్లింగము దగ్గరికి వెళ్లినా సంపూర్ణ ఫలితం రాదు అని నందీశ్వరుడు చెప్పాడు. శత్రువులు మిత్రులుగా అవ్వాలంటే, అష్టమి, చతుర్దశి తిథుల్లో ఒక లక్ష బిల్వపత్రాలతో, శంఖ పుష్పాలతో భక్తితో శివుడ్ని అర్చిస్తే శత్రుపీడ పొతుంది. కీర్తి కావాలంటే, సహస్ర తులసీదళాలు పరమశివునికి సమర్పించాలి. విభూతి లేని నుదురు చూసినచో పాపం అన్నారు పెద్దలు, గురువులు. విభూతి ధరించినవారికి యమదర్శనం ఉండదు. విభూతి ధరించి ప్రయాణం చేసినచో ప్రమాదములు జరుగవు. ఉదాహరణకి ఉపమన్యువు తన తల్లి ఇచ్చిన విభూతితో ఇంద్రుడిని కూడా జయించాడు. పొద్దుట నీటితో కలిపి ధరించాలి. సాయంకాలం పొడిగా ధరించాలి. భస్మధారణ శివునికి చాలా ప్రీతి, అన్ని శుభాలను ప్రసాదిస్తుంది.