కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 17 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము కృష్ణ పక్షం
తిథి: అమావాస్య సా.5.41 కు తదుపరి పాడ్యమి 18 సా.5.26 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ధనిష్ఠ రా.9.44 కు తదుపరి శతభిషం 18 రా.10.00 కు
యోగం: పరిఘ రా.12:28 కు తదుపరి శివ 18 రా.10:44 కు
కరణం: నాగ సా.5:31 కు తదుపరి బవ సా.4:58 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 9.03 - 9.49 కు, రా. 11.14 - 12.04 కు
వర్జ్యం: తె.5.01 - 6.38 కు
అమృతకాలం: ఉ. 10.39 - 12.17 కు
సూర్యోదయం: ఉ. 6.45 కు
సూర్యాస్తమయం: సా. 6.14 కు
🕉️ అమావాస్య , ద్వాపర యుగాది 🕉️
గురుబోధ:
🕉️శనైశ్చర అనుగ్రహం లభించడానికి మరియు నారాయణుని అనుగ్రహం లభించడానికి అమావాస్య నాడు భక్తితో అష్టాక్షరీమంత్ర జపం చేయాలి. అమావాస్యలు, గ్రహణములు ఇలాంటి కాలంలో భక్తితో స్నానము చేసి అష్టాక్షరి వంటి మంత్రాలని జపించేటటువంటి వారికి తిరుగులేని శక్తి లభిస్తుంది.
🕉️కాలభైరవుడికి అష్టమి, అమావాస్య, ఆదివారం, బుధవారం అంటే ఎంతో ప్రీతి. ఆరోజు కాలభైరవుని అర్చిస్తే విశేషానుగ్రహం లభిస్తుంది.
🕉️శ్రీ మహావిష్ణు వేదస్తుతి (గాలవ ముని కృతం) - అమావాస్యలలో, సంక్రాంతి పర్వదినాలలో, గ్రహణాలలో, నదీస్నానాలలో ఈ స్తోత్రం వింటే తిరుగులేనటువంటి శక్తి పొందుతాము. ఇది హరిరక్షణ పొందించే అద్భుత స్తోత్రం. జీవితంలో మనం పొందే కష్టాల నుండి బయటపడవేసే అపూర్వ స్తోత్రం.👇
https://youtu.be/UwFKCtE_fRU?si=VNHzczmxH463LNXD
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial