Feb 17 2023ఫిబ్రవరి 17 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఫిబ్రవరి 17 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం కృష్ణ పక్షము

తిథి : ద్వాదశి రా. 08గం౹౹40ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం :  పూర్వాషాఢ సాయంత్రం 05గం౹౹52ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం : సిద్ధి  రాత్రి 11గం౹౹45ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత 
కరణం :  కౌలవ మధ్యాహ్నం 01గం౹౹15ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹49ని౹౹ నుండి 09గం౹౹35ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹39ని౹౹ నుండి 01గం౹౹23ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 01గం౹౹24ని౹౹ నుండి 02గం౹౹54ని౹౹ వరకు
అమృతకాలం : మధ్యాహ్నం 01గం౹౹21ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹30ని౹౹ కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹58ని౹౹ కు

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణం ఈరోజు ఉదయం చేయాలి.

గురుబోధ 
శివుడు గురురూపంలో భక్తుల గుణాలు తొలగించి జ్ఞానం ఇస్తాడు. సత్త్వ రజస్తమో గుణాలంటే ఏమిటో తెలియజెప్పి, శివతత్త్వం తెలియజేసే మహాత్ముడే గురువు. అందుకే శివుడు, గురువుగారి శరీరమే శివలింగం అని చెప్పాడు. గురుశుశ్రూష చేసేవాడికి పరమేశ్వరలింగ పూజా ఫలం సంపూర్ణంగా లభిస్తుంది. - శ్రీ శివమహాపురాణం.

expand_less