కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 16 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము కృష్ణ పక్షం
తిథి: చతుర్థి రా.12.27 కు తదుపరి పంచమి 17 రా.2.39
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: హస్త రా.2.59 కు తదుపరి చిత్త 17 తె.5.37
యోగం: ధృతి ఉ. 08.05 కు తదుపరి శూల 17 ఉ. 08.54 కు
కరణం: బవ మ.1.02 కు తదుపరి బాలవ రా. 2.16 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 4.42 - 5.28 కు
వర్జ్యం: ఉ.9.49-11.35 కు
అమృతకాలం: రా. 9.45 - 11.35 కు
సూర్యోదయం: ఉ. 6:31 కు
సూర్యాస్తమయం: సా. 5:51 కు
🕉️సంకటహర చతుర్థి🕉️
గురుబోధ:
గణేశుని అనుగ్రహం కోసం ప్రతి మాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిన సంకటహర చతుర్థి వ్రతం ఆచరిస్తారు.
జీవితంలో త్రీవమైన కష్టాలు ఇబ్బందులు పడుతున్నవారు సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో తొమ్మిది సార్లు ఆచరించడం వలన తప్పక ఉపశమనం లభిస్తుంది. - గణేశ పురాణం
https://srivaddipartipadmakar.org/stotram/sri-ganesa-dwadasa-nama-stotram-padma-puranam
https://srivaddipartipadmakar.org/stotram/sri-gana-nayaka-ashtakam-padma-puranam/