కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 16 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసము శుక్లపక్షం
తిథి: సప్తమి మ. 2.38 కు తదుపరి అష్టమి
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: భరణి మ. 2.20 కు తదుపరి కృత్తిక
యోగం: బ్రహ్మ మ. 03.18 కు తదుపరి ఐంద్ర
కరణం: వణిజ ఉ. 08.54 కు తదుపరి విష్టి
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 09.02 - 09.48 కు & మ. 12.54 - 01.40 కు
వర్జ్యం: రా. 2.00 - 3.33 కు
అమృతకాలం: ఉ. 9.45 - 11.17 కు
సూర్యోదయం: ఉ. 6.43 కు
సూర్యాస్తమయం: సా. 6.18 కు
🕉️ రథసప్తమి 🕉️
🕉️ శ్యామలానవరాత్రులు 7వ రోజు 🕉️
గురుబోధ:
రథసప్తమి నాడు ఆవుపేడ ద్వారా తయారైన పిడకలపై క్రొత్త కుండలో కానీ లేదా ఇత్తడి పాత్రతో కానీ, ఆవుపాలతో పాయసం వండి చిక్కుడు కాయల రథం మీద, చిక్కుడు ఆకులు వేసి దాని మీద పాయసం పెట్టి సూర్యునికి నివేదించి, ఆ ప్రసాదాన్ని స్వీకరించినవారు సకల పాపాల నుండి విముక్తిని పొంది, ఆరోగ్యాన్ని పొందుతారు. నేడు ఖచ్చితంగా శ్రీ మార్కండేయ పురాణాంతర్గత ఆదిత్య స్తవం, ఆదిత్య హృదయం శ్రవణం లేదా పారాయణం చెయ్యాలి.
తప్పక చదువవలసిన శ్లోకాలు:
సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ |
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహద్యుతిమ్ ।
తమోఽరిం సర్వపాపఘ్నం ప్రణతోఽస్మి దివాకరమ్ ॥
ఆదిత్య స్తవం👇ఆదిత్య హృదయం👇శ్యామలా దండకం👇