Feb 16 2023ఫిబ్రవరి 16 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఫిబ్రవరి 16 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం కృష్ణ పక్షము 

తిథి : ఏకాదశి రా. 10గం౹౹56ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం :  మూల రాత్రి 07గం౹౹20ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం : హర్షణ  ఉదయం 07గం౹౹03ని౹౹ వరకు తదుపరి వజ్ర 
కరణం :  బవ సాయంత్రం 04గం౹౹15ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 10గం౹౹22ని౹౹ నుండి 11గం౹౹08ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹57ని౹౹ నుండి 03గం౹౹43ని౹౹ వరకు
వర్జ్యం : సాయంత్రం 05గం౹౹49ని౹౹ నుండి 07గం౹౹19ని౹౹ వరకు & తెల్లవారి 04గం౹౹20ని౹౹ నుండి 05గం౹౹58ని౹౹ వరకు
అమృతకాలం : మధ్యాహ్నం 01గం౹౹16ని౹౹ నుండి 02గం౹౹47ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹31ని౹౹ కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹58ని౹౹ కు

🕉️👉ఏకాదశి👈🕉️

ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ద్వాదశీ పారణం రేపు ఉదయం చేయవచ్చును.

గురుబోధ 
శివునికి అత్యంత ప్రీతికరమైన కాలం సాయం సంధ్యాసమయం.  ఆ సమయంలో చేసే ప్రదక్షిణ, పూజ, అభిషేకం మరింత విశేషఫలితాన్ని ఇస్తుంది. 
పరమపవిత్రమైన అరుణాచల లింగాన్ని దర్శించేవారికి, ధ్యానించేవారికి పునర్జన్మ ఉండదు. ఇక్కడ చేసిన జపం, దానం, హోమం తక్కిన ప్రదేశాలలో చేసిన దానికంటె కోటిరెట్లు ఫలితాన్ని ఇస్తాయి. శైవక్షేత్రాలలోకెల్లా ఇది గొప్ప క్షేత్రం అవుతుంది. ఈ ప్రాంతంలో నన్ను స్మరించినవాడికి తప్పక ముక్తికి లభిస్తుంది అని స్వయంగా శివుడే చెప్పాడు. - శ్రీ శివమహాపురాణం.

expand_less