Feb 15 2026ఫిబ్రవరి 15 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 15 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము కృష్ణ పక్షం

తిథి: త్రయోదశి సా.4.38 కు తదుపరి చతుర్దశి 16 సా.5.26 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ రా.7.42 కు తదుపరి శ్రవణం 16 రా.8.58 కు
యోగం: వ్యతీపాత తె.2:46 కు తదుపరి వరీయాన్ 16 రా.1:49 కు
కరణం: వణిజ సా.5:05 కు తదుపరి శకుని 16 సా.5:34 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 4.42 - 5.27 కు
వర్జ్యం: రా.11.54 - 1.36 కు
అమృతకాలం: మ. 12.59 - 02.41 కు
సూర్యోదయం: ఉ. 6.46 కు
సూర్యాస్తమయం: సా. 6.13 కు

🕉️🔱 మహాశివరాత్రి, శనైశ్చర జయంతి🔱🕉️

గురుబోధ:
🕉️శివలింగరూపములో పరమశివుడు మాఘమాస
కృష్ణ చతుర్దశి అర్థరాత్రి నాడు ఆవిర్భవించాడు.
ఆ పర్వదినమును శివరాత్రి అంటారు.
🕉️లింగం సగుణ, నిర్గుణ రూపం కాగా, శివరాత్రి అర్థరాత్రి 12 గంటల 'లింగోద్భవ కాలం'
అత్యంత పవిత్రమైనది. ఈ సమయంలో శివుడిని అర్చించే వారికి ఈతిబాధలు తొలగి,
శాశ్వత కైలాస నివాసం సిద్ధిస్తుంది. భక్తులు బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం ఆచరించి,
విభూతి మరియు రుద్రాక్షలు ధరించి శివారాధన చేయాలి.
ముఖ్యంగా అర్థరాత్రి 12 గంటలకు పంచామృతాలు, ఫలరసాలు మరియు గంగాజలంతో అభిషేకించి, 'నమః శివాయ' మంత్రంతో అర్చన చేయాలి. రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి 12 నుండి 3 గంటల వరకు శివ పురాణ గాథలు వింటూ జాగరణ చేయాలి. ఇలా చేయడం వల్ల దారిద్ర్యం తొలగి, ఆయురారోగ్యాలు మరియు మనశ్శాంతి లభిస్తాయి. మరుసటి రోజు స్నానం చేసి దానధర్మాలు మరియు గురు దర్శనం చేసుకుంటే ఈ వ్రత ఫలం సంపూర్ణమవుతుంది.
🕉️శత్రువులు మిత్రులుగా అవ్వాలంటే,
అష్టమి, చతుర్దశి తిథుల్లో ఒక లక్ష బిల్వపత్రాలతో, శంఖపుష్పాలతో భక్తితో శివుడ్ని అర్చిస్తే శత్రుపీడ పొతుంది. కీర్తి కావాలంటే, సహస్ర తులసీదళాలు పరమశివునికి సమర్పించాలి.
🕉️విభూతి లేని నుదురు చూసినచో పాపం అన్నారు పెద్దలు, గురువులు. విభూతి ధరించినవారికి యమదర్శనం ఉండదు. విభూతి ధరించి ప్రయాణం చేసినచో ప్రమాదములు జరుగవు. ఉదాహరణకి ఉపమన్యువు తన తల్లి ఇచ్చిన విభూతితో ఇంద్రుడిని కూడా జయించాడు. పొద్దుట నీటితో కలిపి ధరించాలి. సాయంకాలం పొడిగా ధరించాలి. భస్మధారణ శివునికి చాలా ప్రీతి, అన్ని శుభాలను ప్రసాదిస్తుంది.

శివారాధన👇
https://youtube.com/shorts/lzHlmYznO_Q?si=se9qRd2fIix7z0Ia
మహాదేవ స్మరణ ఫలితం👇
https://youtube.com/shorts/jRi1TXN3x3Q?si=tFYidTRuL6KuNTT3
శివలింగ పూజా విధానములు👇
https://youtu.be/8wO95-D5cM4?si=nF3LfXiyTUg-5iid
శివలింగార్చన👇
https://youtu.be/rQFXf9rBMTU?si=EUq_DFSossFGsp2p

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less