Feb 15 2023ఫిబ్రవరి 15 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఫిబ్రవరి 15 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం కృష్ణ పక్షము 

తిథి : దశమి రా. 12గం౹౹58ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం :  జ్యేష్ఠ రాత్రి 08గం౹౹37ని౹౹ వరకు తదుపరి మూల
యోగం : వ్యాఘాత  ఉదయం 10గం౹౹01ని౹౹ వరకు తదుపరి హర్షణ 
కరణం :  గరజి ఉదయం 07గం౹౹39ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 11గం౹౹53ని౹౹ నుండి 12గం౹౹39ని౹౹ వరకు
వర్జ్యం : తెల్లవారి 04గం౹౹11ని౹౹ నుండి 05గం౹౹42ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 12గం౹౹12ని౹౹ నుండి 01గం౹౹44ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹31ని౹౹ కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹58ని౹౹ కు

🕉️👉దాసనవమి - (ఫిబ్రవరి 15) ఛత్రపతి శివాజీ మహరాజ్ గారి గురువులు శ్రీ సమర్థ రామదాస స్వామి వారి ఆరాధన. మాఘ బహుళ నవమి (దాసనవమి)👈🕉️

గురుబోధ 
అన్నద్రోహం, గురుద్రోహం, బ్రహ్మద్రోహం న కారయేత్ - అన్నం పెట్టినవారిని, బ్రహ్మజ్ఞానులను ద్వేషించేవారిని, గురుద్రోహులను బ్రహ్మనుండి పుట్టిన పిశాచములు పట్టుకుంటాయి. అందుకే ఎప్పుడూ జాగరూకతతో శివనామస్మరణంతో మన బుద్ధి, మనసు, ఆత్మ పవిత్రంగా ఉండేలా ప్రదక్షిణలు, పూజ, అర్చన, అభిషేకములు వీలైనంత తరచుగా చేసుకుంటూ ఉండాలి, కుదరని పక్షంలో ఈ భగవత్ కార్యక్రమాలు చేసుకునేవారికి వీలైనంత సహాయం చేయాలి.  - శ్రీ శివమహాపురాణం.

expand_less